కలం, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (The Raja Saab) హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. భారీ యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ హారర్ కామెడీ చేయడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.
ఏపీలోని కడప జిల్లా కేంద్రంలోని రవి థియేటర్ (Theatre) వద్ద అభిమానులు బైకులతో విన్యాసాలు చేశారు. జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ విమల్ థియేటర్‌లో ‘రాజాసాబ్’ ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రీమియర్ షో వేస్తామని తెల్పడంతో.. థియేటర్ లోపలికి అభిమానులు ఫ్యాన్స్ దూసుకెళ్లారు. ఈ ఘటనతో థియేటర్ వద్ద కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.


