కలం వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘రాజాసాబ్'(Raja Saab)కు తెలంగాణ(Telangana)లో టికెట్ రేట్లు(Ticket Price) పెంచుకునేందుకు సర్కార్ అనుమతిచ్చింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఆలస్యంగా జీవో జారీ చేసింది. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 వరకు టికెట్స్ ధరలు పెంచుకోవచ్చు. జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌లలో రూ.89 పెంచుకునేందుకు ఛాన్స్ ఉంది. అదనపు ఆదాయంలో 20 శాతాన్ని ఫిల్ం ఇండస్ట్రీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్‌కు జమ చేయాలని ప్రభుత్వం కండీషన్ పెట్టింది. ప్రీమియర్ షోలకు మాత్రం అనుమతి నిరాకరించారు. ఏపీలో మాత్రం ఇంతకు ముందే అనుమతులు ఇచ్చారు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఎంటర్‌టైనింగ్ సినిమా చేస్తుండటంతో గురువారం రాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి నెలకొంది.


