epaper
Monday, March 2, 2026
epaper

‘ది రాజా సాబ్‌’.. రెబల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ది రాజా సాబ్(Raja Saab)’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ ఫిక్స్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) మరోసారి లవర్ బాయ్ టైప్‌లో కనిపించనున్నాడు. దీంతో లవర్ బాయ్ ప్రభాస్ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా, మారుతీ(Director Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ–హారర్‌ చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి మొదటి సింగిల్‌ ‘రెబల్‌ సాబ్‌’ను నవంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసింది.

హారర్‌ జానర్‌లో ప్రభాస్‌ తొలిసారి నటిస్తున్నందున ‘ది రాజాసాబ్‌(Raja Saab)’పై అందరి దృష్టి నిలిచింది. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, సంజయ్‌ దత్‌(Sanjay Dutt) తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, స్టిల్స్‌ ఈ సినిమాపై ప్రేక్షకుల కుతూహలాన్ని మరింత పెంచాయి. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్రభాస్‌ విన్టేజ్‌ స్టైల్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌ విజువల్‌గా కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. ‘ది రాజాసాబ్‌’ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Read Also: రాజమౌళికి ఆర్జీవీ సపోర్ట్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!