బిగ్‌బాస్’ షోపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు!

బిగ్ బాస్(Bigg Boss).. ఈ షో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పా్లసిన అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో టాప్ టీఆర్‌పీ రేటింగ్ అందుకుంటున్న షోస్‌లో ఇది కూడా ఒకటి. అయితే తాజాగా కన్నడ బిగ్‌బాస్ నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది. ఈ షోపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఎప్పటిలా కన్నడ వెర్షన్‌కు ఈ ఏడాది కూడా నటుడు కిచ్చా సుదీప్(Sudeep Kiccha) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి షో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. మొదట బిగ్‌బాస్ హౌస్ నుంచి అధికంగా వ్యర్థాలు వెలువడుతున్నాయనే ఫిర్యాదు రావడంతో కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిలిపివేసి, తర్వాత రీస్టార్ట్ చేశారు.

ఇప్పుడైతే కన్నడ బిగ్‌బాస్‌ 12వ సీజన్‌పై మరో వివాదం నెలకొంది. బిగ్‌బాస్‌(Bigg Boss) హౌస్‌లో కుల వివక్ష, మహిళల అవమానం చోటుచేసుకుందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర.. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ వద్ద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో హోస్ట్‌ సుదీప్‌తో పాటు కంటెస్టెంట్లు అశ్విని గౌడ, రషిక పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు.

ఒక ఎపిసోడ్‌లో సుదీప్, కంటెస్టెంట్‌ రక్షిత‌ను అవహేళన చేసేలా కామెంట్లు చేశారని సంధ్య తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇది మహిళలను అగౌరవపరిచే విధంగా ఉందని పేర్కొన్నారు.

అంతేకాదు, రషికపై మరో పోటీదారు మాలవಳ್ಳಿ నటరాజ్ (గిల్లి) శారీరక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. అలాగే కర్ణాటక రక్షణ వేదికకు చెందిన అశ్విని గౌడపై కులవివక్ష వ్యాఖ్యలు చేసినట్లు, రక్షిత సామాజిక నేపథ్యాన్ని ఎగతాళి చేసినట్లు కూడా ఫిర్యాదులో వివరించింది.

Read Also: ‘ది రాజా సాబ్‌’.. రెబల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>