Mobile Popup Ad
Mobile Popup Ad

డైరెక్టర్ వి.వి. వినాయక్‌ని కలిసిన ప్రభాస్

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ‘ది రాజాసాబ్’ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ప్రభాస్ తన తరువాత సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఫౌజీ, కల్కి 2, స్పిరిట్, సలార్ 2 వంటి భారీ పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. ఈ సినిమాలతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రభాస్ చూస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ (Prabhas) స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ (VV Vinayak)  ని కలిశారు. వినాయక్ ఇంట్లో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరైన ప్రభాస్.. డైరెక్టర్ వినాయక్‌ను ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే ఈ పార్టీకి మెహర్ రమేష్ (Meher Ramesh) కూడా హాజరయ్యారు. ముగ్గురు కలిసి దిగిన ఫోటోని మెహర్ రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియా కథనాల ప్రకారం వీరి ముగ్గురి కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

Read Also : రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ బిగ్ అప్డేట్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>