Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేత దారుణం : ఈటల రాజేందర్

కలం, డెస్క్ : ఖమ్మంలోని భూదాన్ భూముల్లోని ఇండ్లను అధికారులు కూల్చివేయడం అత్యంత దారుణం అన్నారు ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender). తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. హైదరాబాద్ లో కూల్చుతున్నవి చాలవన్నట్టు.. ఖమ్మంలోని ఇంటికో డీసీఎం పంపి వారి ఇండ్లను కూల్చివేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని.. ఓ వైపు పెద్దలు వేల కోట్ల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే కనీసం పట్టించుకోవట్లేదని.. కానీ పేదల ఇండ్లను మాత్రం పనిగట్టుకుని కూల్చుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.

కూకట్ పల్లిలోని ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సీఎం రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. మూసీ ప్రక్షాళనతో (Musi Rejuvenation) వందలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నారంటూ ఎంపీ ఈటల (Etala Rajender) ఫైర్ అయ్యారు. ప్రజా పాలన అనేది పేరుకే గానీ.. కాంగ్రెస్ ఎప్పుడూ పెద్దల ప్రభుత్వమే అన్నారు. పేదల ఇండ్లను కూల్చివేస్తే సహించేది లేదని.. బీజేపీ తరఫున పోరాడుతామని చెప్పారు.

Read Also : భర్త సీఎం.. భార్య ఎమ్మెల్యే.. అసెంబ్లీలో ప్రశ్నలు..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>