కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందుతోంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit Movie) కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ తాజా షెడ్యూల్‌లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య హై ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు సుమారు 2 నెలల పాటు సుదీర్ఘంగా ఈ షెడ్యూల్ జరగనుందని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ తన తొలిసారి పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తుండగా.. పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ (డాన్ లీ) మడాంగ్‌సియోక్ కూడా విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే డాన్ లీ ఎంట్రీపై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

