జపాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం!

కలం, వెబ్ డెస్క్: జపాన్‌లోని (Japan Earthquake) సెంట్రల్ రీజియన్ లో ఆదివారం వేకువజామున భారీ భూకంపం సంభవించింది. పటిష్టమైన భూ ప్రకంపనల ధాటికి పలు భవనాల్లోని అద్దాలు పగిలపోయాయి. ప్రమాదాన్ని గ్రహించిన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనలో శిథిలాలు, గాజు పెంకులు తగిలి కనీసం 22 మంది తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.7గా నమోదైందని అధికారులు వెల్లడించారు.

భూకంపం కారణంగా పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. బుల్లెట్ రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోగా, స్థానిక రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అలాగే పలు భవనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ఈ తీవ్రత వల్ల తీరప్రాంతాలకు ఎలాంటి సునామీ ప్రమాదం లేదని జపాన్ పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే రాబోయే కొద్ది రోజులు తదుపరి ప్రకంపనలువచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>