పెట్రోలియం టెర్మినల్ నిర్మాణం కేంద్ర విజన్‌కు నిదర్శనం: ఈటల

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మల్కాపూర్‌లో నూతన పెట్రోలియం టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మల్కాపూర్ ప్రాంత భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చడంలో, పారిశ్రామిక వృద్ధికి మద్దతుగా నిలవడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ ద్వారా తెలంగాణ ఇంధన భద్రత మరింత పటిష్టం కానుందని చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు, వాహనదారులకు ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రాజెక్ట్ భరోసా ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెట్రోలియం టెర్మినల్ ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంధన నిల్వ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. భవిష్యత్తులో పెరగబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును సిద్ధం చేయడం కేంద్ర ప్రభుత్వ విజన్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>