కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. చాలా కాలం తర్వాత ఆయన ఎంటర్ టైన్ మెంట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 9న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. నిన్న నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రిద్ధి కుమార్ (Riddhi Kumar) ఓ ఇంట్రెస్టింట్ విషయాన్ని బయట పెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే ప్రభాస్ (Prabhas) ఇచ్చిన అవకాశం వల్లే. ప్రభాస్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇచ్చిన చీర కట్టుకోడానికి మూడేళ్ల నుంచి వెయిట్ చేశాను. ఈ రోజు కుదిరింది’ అంటూ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి ఆమెకు ప్రభాస్ చీర గిఫ్ట్ గా ఇచ్చాడని తేలిపోయింది. ప్రభాస్ ఇప్పటి వరకు హీరోయిన్లకు మంచి భోజనం పెడుతాడని మాత్రమే మనకు తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ ఒక హీరోయిన్ కు చీర గిఫ్ట్ గా ఇచ్చాడని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Read Also: యాంకర్ సుమ కామెంట్లపై వివాదం..
Follow Us On: Youtube


