కలం, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) శనివారం రెండో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. మొదటి రోజు దాదాపుగా 6 గంటలపాటు విచారించిన సిట్ రెండో రోజు ఆయనను ప్రశ్నించింది.
రివ్యూ కమిటీ సిఫార్సుతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారా? అన్న కోణంలో ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. హార్డ్ డిస్క్ ధ్వంసంపై కూడా ప్రశ్నించారు. కొత్తగా ఏడు హార్డ్ డిస్క్ లు ఎందుకు రీప్లేస్ చేయాల్సి వచ్చింది? అన్న కోణంలోనూ ప్రశ్నించారని తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా ఇప్పటికే అనేక మంది బాధితులు సిట్(SIT) ముందు హాజరై వాంగ్మూలాలు సమర్పించారు. వారి ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రభాకర్ రావు(Prabhakar Rao)ను ప్రశ్నించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఎటువంటి పురోగతి వస్తుందో.. ప్రభాకర్ రావు ఏమేం సమాధానాలు చెప్తారో వేచి చూడాలి.
Read Also: సీఎం రేవంత్ టీమ్ పేరు ‘ఆర్ఆర్-9’ ‘అపర్ణ ఆల్ స్టార్స్’ టీమ్‌లో మెస్సీ
Follow Us On: Sharechat


