పవన్ కల్యాణ్ కల్ట్ క్లాసిక్ మూవీ.. “జల్సా” కు 18 ఏళ్లు పూర్తి

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ‘జల్సా’(Jalsa) సినిమా విడుదలై నేటికి (ఏప్రిల్ 2, 2026) 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించి, పవన్ కల్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Aravind) నిర్మాతగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కించాడు.  కథ, మాటలు, హాస్యం, భావోద్వేగాలు అన్నీ కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, ఇలియానా గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ ఫుల్ పాపులర్ అని చెప్పవచ్చు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) అందించిన సంగీతం సినిమాకే హైలెట్ గా నిలిచింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందిపడుతున్న పవన్ కల్యాణ్ ‘జల్సా’ సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ మరోసారి తన ప్రత్యేకమైన నటనతో అభిమానులను మెప్పించగా, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఆయనకు మంచి బాండింగ్ ఏర్పడింది.  18 ఏళ్లు గడిచినా ‘జల్సా’ క్రేజ్  ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో అభిమానులు ఈ సినిమాను గుర్తుచేసుకుంటూ, పవర్ స్టార్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>