Mobile Popup Ad
Mobile Popup Ad

భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు

కలం, వెబ్ డెస్క్: హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ముజఫర్‌నగర్‌లో జరిగిన వేడుకల్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ప్రమాదం కలకలం రేపింది. ఊరేగింపులో ఓ ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. రోడ్డుపై ఉన్న భక్తులపైకి (Devotees) ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాక్టర్ బ్రేకులు విఫలం కావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>