మంత్రి లోకేశ్ ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాలి: పూన‌మ్ కౌర్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు (Chandrababu) ప్ర‌తిపాదించిన జ‌నాభా పాల‌సీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఎంపీ రేణుకా చౌద‌రి, కిర‌ణ్ బేడీ వంటి వారు ఎక్స్ వేదిక‌గా దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా.. తాజాగా న‌టి పూన‌మ్ కౌర్ (Poonam Kaur) చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. పూన‌మ్ చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు బ‌దులిస్తూ ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు ఎక్కువ మంది పిల్ల‌లు ఉండాల‌ని భావిద్దామ‌ని పేర్కొంది. లోకేశ్‌తోనే ఈ ప్ర‌క్రియ మొద‌లు పెడ‌దామ‌ని వ్య‌గ్యంగా చెప్పుకొచ్చింది. తాను సాధార‌ణంగా ఏది మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడుతాన‌ని పూన‌మ్ స్ప‌ష్టం చేసింది.

జ‌నాభా క్షీణ‌త‌ను అరిక‌ట్టేందుకు ఏపీలో ఎక్కువ మంది పిల్ల‌ల‌ను క‌నే కుటుంబాల‌కు ప్రోత్సాహ‌కాలు అందిస్తామ‌న్న సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌పై ఇప్ప‌టికే మ‌హిళా సంఘాలు, ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో పూన‌మ్ కౌర్ నేరుగా సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్‌ను టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌నాల‌పై ఏదైనా రుద్దే ముందు పాల‌కులే పాటించి చూపించాల‌న్న అర్థం వ‌చ్చేలా పూన‌మ్ కౌర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>