వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి : మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో : వారం రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. వరి, మొక్క జొన్న సేకరణలో ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ, రైస్ మిల్లర్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు ధన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు వేగవంతం కావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేయగా.. 314 ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ ధాన్యం వచ్చిందన్నారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంగా ధాన్యం సేకరణ 100 శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇప్పటి వరకు 1.58 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తి చేశామని, మిగిలిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సేకరించిన ధాన్యంలో 63 శాతం 237.39 కోట్లు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగయన్నారు.
ధాన్యం సేకరణకు మిల్లులు, లారీల యజమానులు సహకరించాలని.. ధాన్యం అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలని కోరారు. అలాగే, కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.

PACS కేంద్రాల్లో సిబ్బంది తక్కువగా ఉండడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సన్న రకం ధాన్యం ఎంత అవసరమో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని మిల్లులో రెండు రోజుల పాటు లారీలు ఆగి ఉండడం వల్ల లారీలు ఆగుతున్నాయన్నారు. వారం రోజుల్లో 80 వేల మెట్రిక్ టన్నులు తరలించాలని ఆదేశించారు. గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోకల్ హామలీలు ఉపయోగించుకోవాలని సూచించారు. లోకల్ హామలీలు వినియోగించుకునేలా ఐకేపీ ఇంచార్జి లదే బాధ్యత దిశగా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

రైస్ మిల్లులకు , లారీల అసోసియేషన్ లకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామినిచ్చారు. ధాన్యం సేకరణలో రవాణా ఇబ్బందులు లేకుండా పోలీస్, రవాణా శాఖ అధికారులు, లారీ అసోసియేషన్ సమన్వయం చేసుకొని పని చేయాలని మంత్రి పొన్నం సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, వివిధ విభాగాల అధికారులు, రైస్ మిల్లర్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>