తమిళనాడు మంత్రి విశ్వనాథన్‌కు పొంగులేటి సన్మానం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గంలో విశ్వనాథన్‌ చోటు దక్కించుకోవడం చారిత్రాత్మకమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ (Minister Viswanathan) ఆదివారం మంత్రి పొంగులేటి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ కు పొంగులేటి పుష్పగుచ్ఛం అందించి శాలువా, పూల మొక్కతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వేలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తమిళనాడు మంత్రివర్గంలో విశ్వనాథన్ స్థానం దక్కించుకున్నారని కొనియాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రజాసేవ చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశ్వనాథన్ కృషి చేయాలని ఆకాంక్షించారు.

Read Also: హీట్ వేవ్ ఎఫెక్ట్: ఆల్ టైమ్ హైకి విద్యుత్ వినియోగం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>