మహిళా బిల్లుపై రేవంత్ వ్యాఖ్యలు.. కిషన్ రెడ్డి రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: రెండ్రోజుల్లో 20 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగి 130 మంది ఎంపీలు అభిప్రాయాలు చెప్పి అభ్యంతరాలు నమోదు చేసినా మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)కు ఆమోదం లభించలేదు. 131వ రాజ్యాంగ సవరణ పెండింగ్ లో పడింది. లోక్ సభలో మూడింత రెండొంతుల మెజార్టీ సాధించలేక నారీకి మోదీ సర్కార్ సారి చెప్పింది. ఇక అప్పటినుంచి మొదలైన పొలిటికల్ మంటలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మహిళలకు ఓటు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీ నుంచి మొదలుకొని ఇప్పటికీవరకు ప్రాధాన్యతను కట్టుబడి ఉన్న ఏకైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, త్వరలోనే మహిళా లోకం అంతా ఏకమై కాషాయ పార్టీకి బుద్ధి చెబుతోందన్నారు. బీజేపీ కుట్రలను మహిళా లోకం చూస్తోందని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై (Women Reservation Bill) సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) రంగంలోకి దిగారు. మీరా మహిళల గురించి మాట్లాడేదా? అంటూ ఫైర్ అయ్యారు. 60 ఏళ్ళు ఉమ్మడి రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క మహిళను ముఖ్యమంత్రిగా చేయలేదని మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. మహిళా రిజర్వేషన్లపై సీఎం రేవంత్ తలాతోకా లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఏరోజైనా బీసీ ముఖ్యమంత్రిని చేశారా? అని ప్రశ్నించారు. మొత్తంగా మహిళాబిల్లుపై మెజారిటీ రాకపోవడంతో పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరింది.

 Read Also: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా, రణవీర్ సింగ్ జోడి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>