కలం, వెబ్ డెస్క్: ఏపీలో పలువురు మంత్రులకు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు (Maoists Threat Letters) వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులతో సహా చంపేస్తామంటూ మంత్రులు సత్యప్రసాద్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్‌లకు మావోయిస్టుల పేరిట లేఖలు రాశారు. సచివాలయంలోని మంత్రుల పేషీకి ఈ లేఖలు రాగా, మంత్రుల కార్యాలయాల నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీసుల దర్యాప్తులో ఇవి మావోయిస్టుల బెదిరింపు లేఖలు కాదని ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే ఈ లేఖల వెనుక ఎవరున్నారన్నది త్వరలో తేలుస్తామని వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. బెదిరింపుల లేఖపై మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తూళ్లురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్ బీఎన్ఎస్ 352, 351(2), 351(4), బీఎన్ఎస్ఎస్174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. కందుల దుర్గేష్ తాను ఏ తప్పు చేయలేదని, తనకు ఇలాంటి బెదిరింపులు (Maoists Threat Letters) వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఇది మావోయిస్టుల లేఖ కాదని కొట్టి పారేశారు.
Read Also: కంపెనీలకు భూములపై ఏపీ అసెంబ్లీలో రచ్చ
Follow Us On : WhatsApp


