కరీంనగర్ నివాస కేంద్రంలో పేకాట.. పోలీసుల దాడిలో ప్రముఖులు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రం పరిధిలోని ఒక పేకాట కేంద్రంపై పోలీసులు దాడి చేసిన సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మీడియా ప్రతినిధి ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ​సోమవారం రాత్రి కరీంనగర్ (Karimnagar) పరిధిలోని సుభాష్ నగర్, ఆరెపల్లి రహదారిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఓ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పేకాటరాయుళ్లు అడ్డాగా మార్చుకున్న ఇంటిపై దాడులు నిర్వహించారు. పెంట హౌజ్ లో మందు విందుతో పాటు జూదం ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో భారీ సంఖ్యలో జూదగాళ్లు, మొబైల్ ఫోన్లు, భారీ వాహనాలు దొరికినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ​ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు, కరీంనగర్ చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు ఉండడంతో గేమింగ్ యాక్ట్ కేసు నుండి తప్పించాలంటూ పోలీసులపై ఒత్తిళ్లు కూడా వస్తున్నట్టుగా తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>