Mobile Popup Ad
Mobile Popup Ad

మామ కోసం అల్లుడి ‘పరీక్ష’.. చివరకు జైలు శిక్ష!

కలం, వరంగల్ బ్యూరో : ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలో మామకు బదులు అల్లుడు పరీక్ష రాయడానికి సిద్ధపడగా గుర్తించిన అధికారుల ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ (Warangal) నగరం మండిబజారుకు చెందిన మహ్మద్ అమీర్ ఖాన్ ఖానాపురం మండలం అశోక్ నగర్ లోని అధ్యయన కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశం పొందాడు. సోమవారం సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా అమీర్ ఖాన్ కు ఖానాపురం జడ్పీఎస్ఎస్ మోడల్ పాఠశాలలోని పరీక్ష కేంద్రం కేటాయించారు. అతడు ప్రస్తుతం సౌదీలో ఉన్నాడు.

తనకు బదులు వరంగల్ నగరం మండిబజారు నివాసి అమీర్ ఖాన్ కు వరుసకు అల్లుడైన అబ్దుల్ ఎక్తేషా పరీక్ష రాసేందుకు కేంద్రానికి వచ్చాడు. ఇన్విజిలేటర్ శ్యామ్ హాల్ టికెట్ పరిశీలించి, ఆధార్ కార్డు చూడగా తేడాగా అని పించడంతో చీఫ్ సూపరింటెండెంట్ రామచందర్, డిపార్టుమెంట్ అధికారి సదానందం దృష్టికి తీసుకెళ్లాడు. వారు కూడా తేడా ఉన్నట్లు గుర్తించి ఎంఈవో సారయ్యకు సమాచారం ఇచ్చారు. పరీక్ష కేంద్రం సీఎస్ ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసి అబ్దుల్ ఎక్తేషాను అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>