కరకగూడెం హత్యాయత్నం కేసు చేధన.. నలుగురికి రిమాండ్

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం (Karakagudem) మండలం అశ్వాపురంపాడు ఫారెస్ట్ ప్లాంటేషన్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ నెల 19న పశువులు మేపుతున్న వజ్జా భీమరాజుపై కత్తులతో దాడి చేసిన ఘటనకు కారణం పాతకక్షలే అని దర్యాప్తులో తేలింది. ​గతంలో గ్రామ పెద్ద వెంకటేశ్వర్లు హత్యకు భీమరాజే కారణమనే కోపంతో, జైలు నుంచి విడుదలైన వెంకటేశ్వర్లుతో కలిసి నిందితులు ఈ దాడికి పథకం వేశారు. ఈ కేసులో కోవాసి బాలకృష్ణ, పోడియం విజయ్, కోవాసి సంతోష్, పోడియం మంగయ్యలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై పి.వి.ఎన్.రావు మీడియాకు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>