వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మందుల గందరగోళం..

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్‌(Warangal) ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital) లోని రోగుల చికిత్సలో ఒక ముఖ్యమైన లోపం వెలుగులోకి వచ్చింది. రోగులకు పరీక్షలు చేసి మందులు రాస్తున్నప్పటికీ, ఆ మందులు ఎప్పుడు తీసుకోవాలి అనే వివరాలు ప్రిస్క్రిప్షన్‌లో స్పష్టంగా ఇవ్వడం లేదని ఒక రోగి ఫిర్యాదు చేశారు.

లత అనే రోగి ఆసుపత్రిలో (MGM Hospital) ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలో సూపరింటెండెంట్‌కు లేఖ రాస్తూ ఈ సమస్యను వివరించారు. డాక్టర్లు మందులు సూచిస్తున్నప్పటికీ.. ఆ మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు తీసుకోవాలో తెలియక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ఫిర్యాదు పెట్టెను పరిశీలించిన అధికారులు ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఇకపై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో ప్రతి మందు ఎప్పుడు తీసుకోవాలో స్పష్టంగా రాయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Read Also: తమ్మడపల్లి జంట హత్యల మిస్టరీ.. ఏడాది కావస్తున్నా పురోగతి ఏది ?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>