పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అన్నారు. బుధవారం నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను అందించడమే తమ లక్ష్యమన్నారు. కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా ప్రభుత్వం ద్వారానే కొనుగోళ్లు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం కలగకుండా రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు సులభంగా, పారదర్శకమైన పద్ధతిలో సేవలు అందుబాటులోకి వస్తాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) కోరారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, డిసిఎంఎస్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>