Mobile Popup Ad
Mobile Popup Ad

పోక్సో కేసు.. కానిస్టేబులుకు 31 ఏళ్ల జైలు శిక్ష

కలం, వెబ్ డెస్క్ : సమాజంలో ఏ నేరం జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్. కానీ, ప్రజలకు రక్షణగా నిలవాల్సి ఓ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు ముసుకుపోయి అభం శుభం తెలియని మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2020లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు (POCSO Case) నమోదు చేయగా ఆరేళ్ల తరువాత పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు కానిస్టేబుల్ వరదరాజ్ సుదేశ్ కు 31 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

డీసీపీ ఆఫీసులో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సుదేశ్ 2020లో బోయినపల్లి ప్రాంతంలో నివసించే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు (POCSO Case) నమోదు అయింది. విచారణలో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు తాజాగా 31 ఏళ్ల కారాగార శిక్ష, ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: జూన్ 2 డెడ్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత హెచ్చరిక!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>