Mobile Popup Ad
Mobile Popup Ad

జూన్ 2 డెడ్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత హెచ్చరిక!

కలం, వెబ్‌ డెస్క్ : తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనే ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు సమరయోధుల పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన భూ పోరాటాలు, నిరంతర ఉద్యమాలకు దిగివచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఆమె గుర్తు చేశారు. అయితే కమిటీల పేరుతో కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు.

ఉద్యమకారుల గుర్తింపునకు వేసిన తాజా కమిటీలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకపోవడంపై కవిత (Kavitha) తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న సమస్త మహిళా లోకాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియ ఈ ఏడాది జూన్ 2వ తేదీన ప్రారంభం కాకుంటే, ఉద్యమకారులందరినీ ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Read Also: పెట్రో ధరల పెంపు.. నేడు గిగ్ వర్కర్ల సమ్మె బాట

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>