కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka)లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం మంత్రి వివేక్ ఆదివారం దుబ్బాకకు వచ్చారు. మంత్రి కారును మున్సిపాలిటీ శివారులో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టు వద్ద పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో కారును తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీ విధులకు మంత్రి వివేక్ సహకరించారు.
Read Also: ఇండియా టాలెంట్ ఇంతే.. నెట్టింట విమర్శల వెల్లువ
Follow Us On: Sharechat


