కలం, వెబ్ డెస్క్: ‘మాటలు తప్ప చేతలు లేని టీమ్ ఇండియా (Team India).. వీరుడు శూరుడు అన్న అభిషేక్ గుండు సున్నా పరుగులు చేశాడు. ఇదే ఇండియా అసలు టాలెంట్.. ఐపీఎల్ టాలెంట్..’ యూఎస్‌తో మ్యాచ్‌లు భారత్ బ్యాటింగ్(Batting)పై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంతకన్నా ఘాటైన విమర్శలు, తిట్లు కూడా ఉన్నాయ్. టీ20 వరల్డ్ కప్ 2026లో యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో పవర్‌ప్లేలో భారత్ కుప్పకూలిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది.
వాంఖడే వేదికగా టాస్ గెలిచిన యూఎస్ఏ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం భారత్‌కు ఇబ్బందిగా మారింది. రెండో ఓవర్‌లోనే అభిషేక్ శర్మ సున్నాకే ఔటయ్యాడు. వెంటనే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో షాడ్లీ వాన్ షాక్‌విక్ వరుసగా ఇషాన్, తిలక్, శివం దూబే వికెట్లు పడగొట్టాడు. ఆ దశలో భారత్ 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఇలా కుప్పకూలడంపై సోషల్ మీడియాలో విమర్శలు భారీగా వచ్చాయి. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆటతీరుపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మొత్తం బ్యాటింగ్ లైనప్ ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాత్రం కొంత బాధ్యత చూపాడని కొందరు గుర్తించారు. జట్టు ఎంపికపై కూడా చర్చ మొదలైంది. మరింత స్థిరత్వం అవసరమని అభిమానులు వ్యాఖ్యానించారు. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఈ అనుభవం నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుంటుందన్న అంచనాతో టోర్నమెంట్ కొనసాగుతోంది.
Read Also: హామీలపై ప్రశ్నిస్తే రేవంత్ బూతులు తిడుతుండు: కేటీఆర్
Follow Us On: Youtube


