వెండితెర సంచలనం.. ‘మగధీర’కు 17 ఏళ్లు

కలం, సినిమా :  తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ‘మగధీర’ (Magadheera) చిత్రం విడుదలై నేటితో (జూలై 31)  17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రబృందాన్ని అభినందించింది. “తెలుగు సినిమాను కొత్త దిశగా మలిచిన ఇండస్ట్రీ హిట్‌కు 17 ఏళ్లు. కథ, విజువల్ గ్రాండియర్, సంగీతం, భారీ నిర్మాణ విలువలు, బాక్సాఫీస్ విజయం వంటి అంశాలలో సరికొత్త ప్రమాణాలను సృష్టించిన టైమ్‌లెస్ ఎపిక్” అంటూ గీతా ఆర్ట్స్ తన పోస్టులో పేర్కొంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్, క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ జంటగా నటించగా.. కీరవాణి అందించిన మ్యూజిక్ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో గ్రాండ్‌గా  తెరకెక్కిన ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సహ నిర్మాతగా ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ, రాజమౌళి టేకింగ్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాయి. 2009లో విడుదలైన ‘మగధీర’ భారీ వసూళ్లతో అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రాల్లో ప్రత్యేక చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ’17YearsForMagadheera’ హ్యాష్‌ట్యాగ్‌లను వైరల్ చేస్తున్నారు.

Read Also: నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో వెండితెరపై మెరవనున్న తేజస్విని

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>