కలం, వరంగల్ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అంతిమయాత్రలో విషాద వాతావరణం నెలకొంది. అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కాలంగా కలిసి పనిచేసిన సహచరుడి మృతిని జీర్ణించుకోలేక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హరీష్ రావు (Harish Rao), కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
అంతిమయాత్రలో కేటీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నల్లబెల్లికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికారు.
పెద్ది అంతిమయాత్రలో బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. పార్టీ జెండాలు, నినాదాల మధ్య అంతిమయాత్ర సాగగా, ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో హరీష్ రావు కన్నీళ్లు
Harish Rao Tears Up During Peddi Sudarshan Reddy’s Final Journey#HarishRao #PeddiSudarshanReddy #BRS #RIPPeddiSudarshanReddy #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/np7VZ5NkMb— Kalam Daily (@kalamtelugu) July 31, 2026
Read Also: అందుకే మాట్లాడలేదు.. ‘నీట్’ లీక్ పై రాఘవ్ చద్దా స్పందన
Follow Us On : WhatsApp

