కలం, వెబ్ డెస్క్ : గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రిటి పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తాము అనుకూలంగా లేమని.. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. అటు ఏపీ ప్రభుత్వం తరఫున కూడా లాయర్లు వాదనలు వినిపించగా.. సోమవారానికి విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పోలవరం-నల్లమల సాగర్ మీద ఇప్పుడు రెండు రాష్ట్రాల నడుమ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.

Read Also: బీఆర్ఎస్ తెలివి తక్కువ పనితో తెలంగాణకు భారీ నష్టం : ఉత్తమ్
Follow Us On: Instagram


