రాజకీయాలు వదులుకుంటా.. పార్టీ మార్పుపై పోచారం కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) పార్టీ మార్పుపై మరోసారి స్పందించారు. గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివ‌ృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లు పునరుద్ఘాటించారు.

అలాగే, తాను ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. తనకు స్వార్థం ఉందని కొందరు బుద్దిహీనులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటానని పోచారం సవాల్ విసిరారు. తాను ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని.. కేసీఆర్ మంచి పనులు చేశాడు కాబట్టే మాట్లాడనని.. రేవంత్ రెడ్డి చేసిన పనుల గురించి కూడా చెబుతానన్నారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని.. ప్రజల కోసమే జీవితం అంకితం చేశానన్నారు. అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డికి మద్ధతు తెలిపానని పోచారం స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను పొగిడారు. నిధుల కోసం ఎవరికి ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే, తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారనని ఈ నిర్ణయం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు లేవని పోచారం చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>