కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని నిజాం కాలేజీలో (Nizam College) విద్యార్థులు నిరసన బాట పట్టారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా ఇప్పటివరకు తమకు హాస్టల్ వసతి కల్పించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమయానికి హాస్టల్ గదులు కేటాయించకపోవడంతో బయట ఉండలేక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే తమకు వసతి సౌకర్యం కల్పించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

