కలం, వెబ్ డెస్క్: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్ పై అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అత్యవసర పిటిషన్ వేశారు. రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలు నిజమో.. కాదో.. తేల్చాలంటూ గత మే నెలలో అలహాబాద్ హై కోర్ట్ ఈడీ, సీబీఐకి సూచించింది. అందులో నిజం ఉంటే చట్ట ప్రకారం ముందుకెళ్లాలని కూడా నిర్దేశించింది.
ఈ నేపథ్యంలోనే, బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన కేసు రాజకీయ కుట్రలో భాగమని, హై కోర్ట్ ఆదేశాలు అమలు కాకుండా నిలిపేయాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుప్రీంకోర్టును కోరారు. రేపు విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్
Follow Us On : WhatsApp

