కలం, వరంగల్ బ్యూరో : గీసుగొండ మండలం శాయంపేట శివారులో ఉన్న మెగా టెక్స్ టైల్ పార్కు (Geesugonda Textile Park)లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న గణేష్ ఇకో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయింది. ఈ దుర్ఘటనలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు అగ్నికీలలకు చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీ ప్రాంగణంలో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో మిగతా సిబ్బంది భయాందోళనతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

