సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ విడుదల

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం (AP Government) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎలా గుర్తించాలి.. ఎలా ధ్రువీకరించాలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి మార్గదర్శకాలు  విడుదల చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ప్రధానంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను వినియోగించుకుంటారు. వీరి ద్వారా ప్రభుత్వ కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ మాధ్యమాన్ని కూడా గణనీయంగా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు వాడాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా వారిని కేటగిరీలుగా విభజించి పారితోషికం చెల్లిస్తారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి నెలకు రూ.15 వేలు, 50 వేల నుంచి 99,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500, 25 వేల నుంచి 49,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి రూ.5,000, 10 వేల నుంచి 24,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి రూ. 2,500 చెల్లిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>