కరీంనగర్‌లో మైనింగ్ స్కామ్.. ట్యాక్స్ ఎగ్గొట్టి దోచేస్తున్న కంపెనీలు

కరీంనగర్, కలం బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో మైనింగ్ కంపెనీలు భారీ‌ అవినీతికి తెరలేపాయి. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించుకుండా దోచుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టి కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్ కంపెనీలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, సీనరేజ్, రాయల్టీని చెల్లించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీశాఖ అధికారులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గ్రానైట్ కంపెనీలు ప్రభుత్వానికి సీవరేజీ, రాయల్టీ చార్జీల రూపంలో సుమారు రూ.100 కోట్లకుపైగా బకాయి ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర సర్కార్‌కు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండానే రైల్వే రేక్‌ల ద్వారా గ్రానైట్‌ను ఇతర దేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర మైనింగ్‌శాఖ కొన్నాళ్ల క్రితం ఓ కేసు విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై బెంచ్‌కు సమర్పించిన రిపోర్టులో ఈ బకాయిల వివరాలు వెల్లడించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది.

ఆర్ఆర్ యాక్ట్ కింద వసూళ్లకు చర్యలు..

ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని పలు గ్రానైట్ కంపెనీలకు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ బకాయిలకు సంబంధించి గతంలో 381 నోటీసులు పంపారు. వీటిలో 197 నోటీసులకు సంబంధించిన బకాయిలను మాత్రమే క్వారీల నిర్వాహకులు చెల్లించారు. ఇంకా రూ.129 కోట్లకు సంబంధించిన 184 నోటీసులు పెండింగ్ లో ఉన్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని గ్రానైట్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్, రాయల్టీ, డీఎంఎఫ్ చార్జీల బకాయిలు చాలా ఏళ్లుగా చెల్లించడం లేదు. దీంతో 2024 డిసెంబర్ వరకు రూ.152 కోట్ల మేర ఉండగా.. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రూ.23 కోట్ల మేర వసూలయ్యాయి. ఇంకా రూ.129 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ కంపెనీలన్నీ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండానే రైల్వే రేక్ ల ద్వారా ఇప్పటికే గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలించేశాయి. బకాయిల వసూళ్లకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించేందుకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు.

Read Also: మునుగోడుకు మళ్లీ జలగండం.. ఇంజినీర్ల ‘ఎత్తు’గడతో జలద్రోహం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>