కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఎల్‌పీజీ గ్యాస్ (LPG Gas) అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ.7 వేల కోట్ల అంచనాతో 1,800 కిలోమీటర్ల మేర కొత్త గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణానికి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ బోర్డ్ (PNGRB) ఆమోదం తెలిపింది. ఈ కొత్త పైప్ లైన్లను తెలంగాణ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్ మీదుగా నిర్మించబోతున్నారు. కొత్త నెట్ వర్క్ కూడా అందుబాటులోకి వస్తే దేశంలో గ్యాప్ పైప్ లైన్ పొడవు 9 వేల కిలోమీటర్లకు చేరనుంది.
రోడ్డు రవాణా తగ్గించేలా ప్రణాళికలు..
సాధారణంగా గ్యాస్ సరఫరాను ఎక్కువ శాతం రోడ్డు మార్గాల్లో లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీని వలన వివిధ రకాలుగా నష్టాలు కలుగుతున్నాయి. వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతరత్ర మౌలిక వసతుల లోపాల కారణంగా కొన్ని సార్లు గ్యాస్ సరఫరా ఆలస్యమవుతోంది. దీన్ని నివారించేందుకు 2030 నాటికి దేశ వ్యాప్తంగా గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసి, ఎక్కడివారికి అక్కడే గ్యాస్ అందించేలా PNGRB రూ.20 వేల కోట్లతో భారీ ప్రణాళికలు చేపట్టింది. దానిలో భాగంగా.. కొత్త పైప్ లైన్ వ్యవస్థ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

