కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya) లో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్, 8వ తరగతిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో కలిపి మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. 8వ తరగతిలో మొత్తం 4 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ అడ్మిషన్ల ప్రక్రియ అంతా పూర్తిగా కేంద్రీయ విద్యాలయ సంగతన్ నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి పారదర్శకంగా నిర్వహించబడుతుందని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25లోపు నల్లగొండలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కార్యాలయానికి నేరుగా వెళ్లి ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు ఫారాలను సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించబోరని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

