Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంధన భద్రతే లక్ష్యం.. UAE పర్యటనకు బయలుదేరిన ప్రధాని

కలం, వెబ్ డెస్క్ : అమెరికా – ఇరాన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అలాగే, ప్రపంచ దేశాల్లోని భారతీయులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఐదు దేశాల పర్యటనకు సిద్ధం అయ్యారు. ఆరురోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా తొలుత నేడు (శుక్రవారం) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటనకు మోదీ బయలు దేరారు. అక్కడ ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశం అవుతారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ముఖ్యంగా ఇంధన సహకారంపై ఇరుదేశాల అధినేతలు చర్చించనున్నారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>