కలం, వెబ్ డెస్క్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ (NEET Re-exam) తేదీని అధికారికంగా ప్రకటించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన ప్రభుత్వం, తాజాగా కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్‌టీఏ భారత ప్రభుత్వ ఆమోదంతో నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21, 2026 ఆదివారం నిర్వహించనుంది. మే 3న జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ వివరాలే వర్తిస్తాయి. హాల్ టికెట్లు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వచ్చే అనధికార వార్తలను నమ్మవద్దని, కేవలం ఎన్‌టీఏ అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని అధికారులు స్పష్టం చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000 లేదా 011-69227700 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

