Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీ హెచ్చరికలు.. అలర్ట్ కావాల్సిందేనా!

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనలో చేసిన ప్రసంగంలో అనేక కీలక విషయాలు చెప్పడంతో పాటు హెచ్చరికల సంకేతాలు కూడా పంపారనే చర్చ జోరుగా జరుగుతోంది. అసలు మోదీ.. వీటిని ఇప్పుడే ఎందుకు చెప్పారు.. రాబోయే సవాళ్లను తట్టుకునేలా ఇప్పటి నుంచే దేశ ప్రజలను సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్నారా.. అనే విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ ఇలాంటి విషయాలు చెప్పినా.. ఇంత గట్టిగా చెప్పడం మాత్రం ఇదే ప్రథమం. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

ప్రధాని మోదీ చెప్పిన కీలక విషయాలు ఇవే..

* వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి పని)కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

* ఒక సంవత్సరం వరకు బంగారం కొనవద్దు.

* పెట్రోల్, డీజిల్ వాడకం వీలైనంత మేర తగ్గించండి. మెట్రోలో ప్రయాణించండి, పార్సిళ్లను రైళ్ల ద్వారా పంపించుకోవాలి.

* కార్లను వాడటం మానుకోండి. ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం అలవాటుగా చేసుకోవాలి.

* వంట నూనె వినియోగాన్ని తగ్గించండి.

* రసాయనిక ఎరువుల వాడకాన్ని సగానికి తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపండి.

* విదేశీ కంపెనీల బ్రాండెడ్ ఉత్పత్తులను ఉపయోగించవద్దు. స్వదేశీ వస్త్రాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. చేనేత వంటి ఉత్పత్తులను ధరించాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>