Mobile Popup Ad
Mobile Popup Ad

తెల్లవారుజామునే ఘోరం.. అయిదుగురు స్పాట్ డెడ్

కలం, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలకొండ జంక్షన్ దగ్గర రేసింగ్ బైక్, కారు ఢీ కొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పాలకొండ జంక్షన్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్పోర్ట్స్ బైకర్ అతి వేగం కారణంగానే..

ఈ ఘటనకు ప్రధాన కారణం స్పోర్ట్స్ బైకర్ అతివేగమే అని పోలీసులు చెబుతున్నారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో కారును వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2), బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్(25), మరో వ్యక్తి మృతి చెందారు. కొద్దిరోజులుగా ఈ బైపాస్ రోడ్డు రేసింగ్‌లకు అడ్డాగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>