కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరుకానున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఆ రోజున నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లు, పారాగ్లైడర్లు ఎగురవేయడాన్ని పోలీసులు నిషేధించారు.
మల్కాజిగిరి జోన్ డీసీపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 10వ తేదీన బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి గగనతల కార్యకలాపాలకు అనుమతి లేదు. రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై రోజంతా నిషేధం అమలులో ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ సి.హెచ్. శ్రీధర్ హెచ్చరించారు. ప్రధాని పర్యటన ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించాలని కోరారు.
Read Also: సీఎంగా విజయ్.. దళిపతి ఫ్యాన్స్ సంబురాలు
Follow Us On: WhatsApp

