Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంగా విజయ్.. దళిపతి ఫ్యాన్స్ సంబురాలు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే పార్టీ సంబురాలు చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాలుస్తూ.. డప్పు చప్పుళ్లతో హోరెత్తిస్తున్నారు. తమ అభిమాన నటుడు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతుండటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై పనైయూర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పార్టీ మద్దతుదారులు భారీగా చేరుకుని ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ హంగామా చేశారు.

మూడు రోజుల ఉత్కంఠకు తెర..

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ (TVK Party) 108 సీట్లు సాధించి, అతి పెద్దదిగా అవతరించినా.. మెజార్టీ మాత్రం రాలేదు. దీంతో, ఇతర పక్షాల సహకారం తప్పనిసరైంది. ఈ క్రమంలోనే.. గత మూడు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. విజయ్ (Vijay) రెండు సార్లు గవర్నర్ వద్దకు వెళ్లినా.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే.. విజయ్ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రంగంలోకి దిగి.. ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్ట్, వీసీకే పార్టీలను ఒప్పించడంతో మార్గం సుగుమం అయింది. మరికాసేపట్లో విజయ్.. గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేల మద్దతు జాబితా ఇవ్వబోతున్నారు.

Read Also: నగరంలో ప్రధాని మోదీ పర్యటన: ఆ ప్రాంతాల్లో కీలక ఆంక్షలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>