కలం, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నది. అసోం పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ (PM Modi) దీన్ని లాంఛనంగా అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు రైతులంతా సిద్ధమవుతున్న తరుణంలో వారికి ఆర్థిక సాయాన్ని ప్రకటించనున్నారు. పీఎం కిసాన్ (PM Kisan) పేరుతో ప్రతి ఏటా ఎకరానికి రూ. 6 వేల చొప్పున మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలో ఇస్తున్న సాయాన్ని ఈ ఏడాది యాసంగి సీజన్‌కు శుక్రవారం విడుదల చేయనున్నారు. అసోం రాజధాని గువాహటి (Guwahati) కేంద్రంగా ఒకేసారి 9.30 కోట్ల మంది రైతులకు తలా రూ. 2 వేల చొప్పున నిధులను విడుదల చేయనున్నారు. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది రైతులు ఈ సాయాన్ని అందుకోనున్నారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ఈ నిధులు జమకానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రైతాంగానికి ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం చేసే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అదే సంవత్సరం డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ (PM Kisan Samman) పేరుతో ప్రతి రైతుకి సంవత్సరానికి రూ. 6 వేల చొప్పున అందజేసేలా శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న ఈ స్కీమ్ 22వ ఇన్‌స్టాల్‌మెంట్ శుక్రవారం అమల్లోకి రానున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధుగా ఉన్న స్కీమ్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతుభరోసాగా మారింది. ప్రస్తుత సీజన్‌కు రైతులకు ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తుందని రైతులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రకటన రాలేదు. కానీ కేంద్రం మాత్రం పీఎం కిసాన్ పేరుతో రూ. 2 వేలను ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది.
Read Also: ఈ టిప్స్ ఫాలో అయితే గ్యాస్ వాడకం 50 శాతం తగ్గించుకోవచ్చు
Follow Us On : WhatsApp

