సత్తుపల్లి రోడ్డుపై ప్రమాద ఘంటికలు

కలం, ఖమ్మం బ్యూరో: అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సత్తుపల్లి (Sathupalli) నుండి విజయవాడకు వెళ్ళే ప్రధాన రహదారిపై ఓ భారీ చెట్టు ప్రమాదకరంగా మారింది. రేజర్ల-లింగపాలెం మార్గంలో రోడ్డుపైకి పూర్తిగా వంగిపోయిన చెట్టు ఎప్పుడు విరిగిపడుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ రహదారిపైకి వంగి ప్రమాదకరంగా ఉన్న చెట్టు అధికారుల దృష్టికి రాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏ క్షణంలోనైనా చెట్టు విరిగిపడి భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందించే పరిస్థితి కొనసాగుతోందని మండిపడుతున్నారు. గతంలో సత్తుపల్లి-బేతుపల్లి మధ్యలో చెట్టు కొమ్మ విరిగిపడి ఓ బాలిక మృతి చెందిన ఘటనను ప్రయాణికులు గుర్తుచేస్తున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే బాధ్యత ఎవరిదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>