నిర్మల్‌‌ జిల్లాలో రిజర్వేషన్స్ డే నిర్వహణ

కలం, నిర్మల్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో 124వ రిజర్వేషన్స్ డే కార్యక్రమాన్ని ఆదివారం నిర్మల్ (Nirmal) జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఛత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూ.. దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం 1902 జులై 26న 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తొలి పాలకుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని పేర్కొన్నారు. బహుజనుల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి రిజర్వేషన్లు బలమైన పునాదిగా నిలిచాయని అన్నారు. యువత ఛత్రపతి సాహు మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>