కాంగ్రెస్​ విధానాల వల్లే దేశాభివృద్ది మందగించింది: ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్​: గత యూపీఏ ప్రభుత్వ పాలనపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్​ అనుసరించిన విధానాల్లో లోపాల కారణంగానే దేశ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఫిక్కీ శతాబ్ది సదస్సు (FICCI Summit) కు ప్రధాని ముఖ్య​ అతిథిగా హాజరయ్యారు. సంస్థ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ సదస్సులో మోదీ దేశ ఆర్థిక ప్రగతి, పేదరిక నిర్మూలన, ప్రభుత్వ విధానాలపై ప్రసంగించారు. గత ప్రభుత్వ పాత పాలసీల వల్లే దేశ అభివృద్ధి మందగించిందన్నారు.

తమ ప్రభుత్వం కాంగ్రెస్​ విధానాలను రద్దు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కేవలం 12-13 ఏళ్లలోనే 5 కోట్ల మంది భారతీయులకు పేదరికం నుంచి విముక్తి కలిగిందని తాజా వరల్డ్​ బ్యాంకు నివేదికలు పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. 1970వ దశకంలో ‘గరీబీ హటావో’ నినాదం ఇచ్చిన సమయంలో దేశ జనాభా సుమారు 50 కోట్లుగా ఉండేదని గుర్తు చేశారు.

అప్పుడే పేదరికాన్ని నిర్మూలించే అవకాశం ఉన్నప్పటికీ, సరైన విధానాలు, సంకల్పం లేకపోవడంతో లక్ష్యం నెరవేరలేదని కాంగ్రెస్​ పార్టీ పై ప్రధాని విమర్శలు చేవారు. దృఢ సంకల్పంతో పనిచేస్తే తక్కువ సమయంలోనే గణనీయమైన మార్పులు సాధ్యమవుతాయని తమ హయాంలో తగ్గిన పేదరికం గణంకాలే నిరూపిస్తున్నాయని చెప్పారు. భారత అభివృద్ధిని ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలు, వేగం దేశ విజయానికి బాటలు వేస్తాయని మోదీ (PM Modi) ధీమా వ్యక్తం చేశారు.

Also Read : భారత ప్రజాస్వామ్యంపై రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>