Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ( PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు..” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టిందని తెలిపారు. సుపారిపాలనతోనే దేశ ప్రజలు బీజేపీనీ ఆదిరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. మమత నియంతృత్వాన్ని అక్కడి ప్రజలు ఎదిరించారని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందని చెప్పారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పాలనను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని వెల్లడించారు. విశ్వాస రాజకీయాలను ప్రజలు నమ్ముతున్నారన్న మోదీ.. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>