Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీ సూచనలు అందరూ పాటించాలి: రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ వేదికగా దేశ హితం కోసం ప్రధాని మోదీ (Ramchander Rao)  చేసిన పొదుపు సూచనలు ప్రజలందరూ పాటించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలపై విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ కు రాంచందర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక సంక్షోభం పరిణామాలనే ప్రధాని ప్రజలకు వివరించారని పేర్కొన్నారు. ప్రజలపై భారం మోపకుండా ప్రధాని పాలన కొనసాగిస్తున్నారని, దేశం కోసమే పొదుపు చర్యలు సూచించారని వెల్లడించారు.

గతంలో నెహ్రూ, ఇందిర కూడా ఇలాంటి సూచనలే చేశారన్న రాంచందర్ రావు.. 2013లో చిదంబరం కూడా బంగారం కొనొద్దని గుర్తు చేశారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు సూచనలు చేయడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు. ప్రధాని మోదీ ప్రజలకు మభ్య పెట్టేందుకు ప్రయత్నించారని.. పాలన చేతగాకే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రాంచందర్ రావు తాజా వ్యాఖ్యలు చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>